19న ఛలో ఎంఈఓ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: మల్యాల గోవర్ధన్

నవతెలంగాణ -నవీపేట్: మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై ఈనెల 19న నిర్వహించే ఛలో ఎం ఈ ఓ కార్యాలయ కార్యక్రమానికి మధ్యాహ్న భోజన కార్మికులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని తెలంగాణ మధ్యాహ్న భోజనం పథక కార్మిక యూనియన్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మల్యాల గోవర్ధన్ అన్నారు. మండల కేంద్రంలో మధ్యాహ్న భోజన కార్మికులతో బుధవారం సమావేశం నిర్వహించి విలేకరులతో మాట్లాడారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికీ మధ్యాహ్న భోజన కార్మికుల పాత బిల్లులు మంజూరు కాలేదని అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వెంటనే పెండింగ్లో ఉన్న పాత బిల్లులను మంజూరు చేసి ఎం డి ఎం కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కొండా గంగాధర్, ఇబ్రహీం, హర్షద్, లక్ష్మి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.