ఐఎన్ టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మల్యాల గోవర్ధన్

– నియామక పత్రాన్ని అందజేసిన జిల్లా అధ్యక్షులు రమేష్ గౌడ్
నవతెలంగాణ – కంటేశ్వర్
ఐఎన్ టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మల్యాల గోవర్ధన్ కు జిల్లా అధ్యక్షులు రమేష్ గౌడ్, చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు బుధవారం జిల్లా కాంగ్రెస్ భవన్లో ఐఎన్ టీయూసీ జిల్లా అధ్యక్షులు ఎన్ రమేష్ గౌడ్, గౌరవ అధ్యక్షులు లక్ష్మణ చారి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు ఎన్ రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. మల్యాల గోవర్ధన్ నిజామాబాద్ జిల్లాలో కార్మికుల సమస్యలపై అనేక పోరాటాలను నిర్వహించారని, కార్మికులను సంఘటితం చేసి అనేక యూనియన్ లను ఏర్పాటు చేయడం జరిగిందని అతని కృషిని గుర్తించి, ఐఎన్ టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మల్యాల గోవర్ధన్ ను నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది అన్నారు.ఐఎన్ టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన మల్యాల గోవర్ధన్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల పక్షపాతిగా ఉందని, జిల్లాలో ఉన్న కార్మికులను సంఘటితం చేసి ఐఎన్ టీయూసీ ని మరింత బలోపేతం చేస్తామని అన్నారు.