మీషోతో మామార్త్‌ భాగస్వామ్యం

హైదరాబాద్‌ : ప్రముఖ సౌందర్య ఉత్పత్తుల బ్రాండ్‌ మామార్త్‌ ఇ-కామర్స్‌ సంస్థ మీషోతో భాగస్వామ్యం కుదర్చుకుంది. తృతీయ శ్రేణీ నగరాలు, చిన్న పట్టణాల మార్కెట్‌లో విస్తరించడానికి మీషోతో ఒప్పందం దోహదం చేయనుందని పేర్కొంది. ఈ వేదికపై వచ్చే ఏడాది కాలంలో రూ.100 కోట్ల రెవెన్యూ చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది.