శరద్‌ పవార్‌తో మమతా బెనర్జీ భేటీ

నవతెలంగాణ – హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎన్సీపీ ఎస్సీపీ నేత శరద్‌ పవార్‌తో శుక్రవారం సాయంత్రం ముంబైలో భేటీ అయ్యారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్ధితులపై వీరు చర్చలు జరిపారు. ఈ సమావేశంలో పవార్‌ కుమార్తె, సుప్రియా సూలే కూడా పాల్గొన్నారు. ఇక ముఖేష్‌ అంబానీ కుమారుడు అనంత్‌ అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహానికి హాజరయ్యేందుకు ముంబై చేరుకున్న మమతా బెనర్జీ దేశ వాణిజ్య రాజధానిలో బిజీ షెడ్యూల్‌ను ప్లాన్‌ చేసుకున్నారు. దీదీ అంతకుముందు ముంబైకి బయలుదేరేముందు కోల్‌కతాలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఉద్ధవ్‌ ఠాక్రే, శరద్‌ పవార్‌, అఖిలేష్‌ యాదవ్‌తో విడివిడిగా భేటీ కానున్నట్టు ఆమె వెల్లడించారు.