హైదరాబాద్: బీసీసీఐ సీనియర్ మహిళల దేశవాళీ వన్డే చాలెంజర్స్ టోర్నమెంట్‌కు తెలంగాణ నుంచి ఇద్దరు క్రికెటర్లు ఎంపికయ్యారు. వికెట్ కీపర్,బ్యాటర్ మమత, పేస్ బౌలర్ యశశ్రీలు వన్డే చాలెంజర్స్ జట్టులో చోటు సాధించారు. జనవరి 5 నుంచి 15 వరకు చెన్నైలో ఈ టోర్నమెంట్ జరుగనుంది. మమత భారత్-బి జట్టులో, యశశ్రీ భారత్-సి జట్టులో నిలిచారు. దేశవాళీ టోర్నీలో రాణించి, జాతీయ జట్టులో చోటు సాధించాలని మమత, యశశ్రీలను హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు అభినందించారు.