– రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలో 14 కేసులలో నిందితుడు
– అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు
– జిల్లా ఎస్పి అఖిల్ మహాజన్
నవతెలంగాణ – సిరిసిల్ల
గత నాలుగు సంవత్సరాలు ఒక ముఠాగా ఏర్పడి జిల్లాలో ప్రభుత్వ రేషన్ బియ్యం ప్రజలకు అంధకుండా పక్కా దారి పట్టిస్తున్నా గుగులోతు పాండు అనే వ్యక్తిని ఇల్లంతకుంట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం వట్టిపల్లెకు చెందిన గుగులోతు పాండు బతుకుదేరువు కోసం సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం జిల్లెల్లకు 15 సంవత్సరాల క్రితం వచ్చి స్థిరపడి గత 5 సంవత్సరాల నుండి కొంత మందితో ఒక ముఠాగా ఏర్పడి రేషన్ బియ్యం దందా నిర్యహిస్తూ వ్యాపరిలా ఏదిగాడు.జిల్లాలోని పలు మండలాలలో తిరిగి రేషన్ బియ్యం కొనుగోలు చేసి వాటిని పెద్ద మొత్తంలో మహారాష్ట్ర లాంటి ప్రాంతాలకు తరలుస్తూన్నాడు. పాండు మీద రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముస్తాబాద్, తంగళ్లపల్లి, సిరిసిల్ల టౌన్, ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్లలో 12 కేసులు, సిద్దిపేట జిల్లాలో 02 కేసు నమోదు కాగా శనివారం ఇల్లంతకుంట మండలం కూనబోయినపల్లి గ్రామ శివారులో ఇల్లంతకుంట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ పంపినట్లు ఎస్పీ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న పి.డి.ఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తూ పేద ప్రజలకు అందకుండా పక్కదారి పట్టిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వివిధ రకాల చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలైన అరికట్టేందుకు నిరంతరం నిఘా పెడుతూ స్పెషల్ డ్రైవ్ లు చేస్తూ విస్తృత స్థాయిలో దాడులు నిర్వహిస్తున్నామని అన్నారు. పేద ప్రజల సంక్షేమం, ప్రభుత్వం అందిస్తున్న పథకాలను పక్కదారి పట్టించిన, ప్రజల ఆహార భద్రతకు భంగం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు.