నవతెలంగాణ-శంకర్‌పల్లి
తాగు డుకు బానిపైన ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మ హత్యకు పాల్ప డ్డాడు. ఈ ఘటన శంకర్ పల్లి మండలంలోని పుతేపురం రైల్యే బ్రిడ్జి సమిపంలో మంగళవారం జరిగింది. శంకర్‌పల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని వెల్వర్తి గ్రామపంచాయతీ అనుబంధ గ్రామమైన కొజ్జాగూడ గ్రామానికి చెందిన నేతి మహేష్ (36)కు పదేండ్ల క్రితమే వివాహం జరిగింది. మూడేండ్ల నుంచి ఏ పని చేయకుండా తాగుడుకు బానిసై భార్యను వేధి స్తుండటంతో భర్త బాధలు భరించలేక భార్య పిల్లలు తీసుకుని ఏదాడి క్రితమే పుట్టింటికి వెళ్లి పోయింది. తాగుడుకు బానిసై బతుకు మీద విరక్తి చెంది విస్కీ మందులో పురుగుల మందు కలుపుకుని తాగి పడుకున్నట్టు పోలీసులు అను మానం వ్యక్తం చేశారు. మృతునికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.