ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

Man committed suicide by hanging himselfనవతెలంగాణ – రాయపోల్

అన్నదమ్ముల మధ్య భూతగాదాలు పరిష్కారం కావడం లేదని అలాగే ఇంటి ఖర్చులు నిమిత్తం చేసిన అప్పులు తీరడం లేదని జీవితంపై విరక్తి చెంది ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాయపోల్ మండలం వీరారెడ్డి పల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. రాయపోల్ పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని వీరారెడ్డి పల్లి గ్రామానికి చెందిన వేముల శ్రీనివాస్ (46) వ్యవసాయం కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. వీళ్ళు వేముల మల్లయ్య, వేముల కిష్టయ్య, వేముల యాదయ్య, వేముల శ్రీనివాస్ నలుగురు అన్నదమ్ములు. వీరికి వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూమిని నలుగురు అన్నదమ్ములు పంచుకున్నారు. కానీ శ్రీనివాస్ కు చెందిన 20 గుంటల భూమి మల్లయ్య పేరుమీద తప్పుగా పడింది. ఆ 20 గుంటల భూమిని శ్రీనివాస్ కు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని తరచూ గొడవలు జరుగుతున్నాయి. అలాగే ఇంటి దగ్గర కూడా ఇంటి స్థలాలు నలుగురు అన్నదమ్ములకు సమానంగా లేకపోవడంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇంటి దగ్గర, వ్యవసాయ పొలం దగ్గర స్థలాల కోసం గొడుగులు జరుగుతుండగా అలాగే శ్రీనివాస్ ఇంటి ఖర్చుల నిమిత్తం చేసిన అప్పులు అధికమవడంతో రెండు విషయాలలో తీవ్రంగా మనస్థాపం చెంది జీవితంపై విరక్తి చెంది బుధవారం రాత్రి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు అందరూ నిద్రించిన సమయంలో ఇంట్లో నుంచి బయటకు వెళ్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇంటి పిల్లర్లకు ఉరి వేసుకున శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు వచ్చి చూసేసరికి శ్రీనివాస్ మృతి చెందారు. ఇట్టి విషయం పోలీసులకు తెలుపగా పోలీసులు పంచనామా పూర్తి చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వ్యవసాయ పొలం వద్ద స్థలం మరియు ఇంటి దగ్గర స్థలం విషయంలో అన్నదమ్ముల మధ్య తగాదాలు, అలాగే అప్పుల విషయంలో మనస్థాపం చెంది మా నాన్న ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి కుమారుడు వేముల అశోక్ ఫిర్యాదు మేరకు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రాయపోల్ ఎస్సై రఘుపతి తెలిపారు.