అప్పుల బాధతో వ్యక్తి మృతి….

suicide-by-hangingనవతెలంగాణ-భిక్కనూర్:
మండలంలోని కంచర్ల గ్రామంలో అప్పుల బాధతో వ్యక్తి మరణించిన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన తిరుమల్ రెడ్డి (45) గత కొంతకాలంగా చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక మానసికంగా బాధపడుతూ బుధవారం రాత్రి వ్యవసాయ బావి వద్దకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లి ఇంటికి తిరిగి రాలేడు. కుటుంబ సభ్యులు వ్యవసాయ బావి వద్ద వెళ్ళి చూడగా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయి కుమార్ తెలిపారు.