నవతెలంగాణ-పెద్దవూర
వడ దెబ్బతో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో శుక్రవారం జరిగింది. ఎస్‌ఐ పరమేష్ తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని నీమా నాయక్ తండకి చెందిన రామావత్ బాలు( 33) వ్యవసాయ పనుల నిమిత్తం గురువారం ఉదయం 10 గంటలకు వ్యవసాయ భూమి వద్దకు వెళ్లి తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు ఇంటికి చేరుకున్నాడు. కొద్దీ సేపైనా తరువాత కడుపులో నొప్పి లేస్తుందని వాంతులు చేసుకుంటు ఉండగా అతని భార్య చికిత్స నిమిత్తం తుమ్మచెట్టు ఎక్స్ రోడ్ వద్ద ఆర్‌ఎంపీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో సాగర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయారని పోలీసులు తెలిపారు.మృతుడు ఎండలో పనిచేయడం వల్ల ఎండ దెబ్బ తగలటం వల్ల చనిపోయాడు అని మృతుడి భార్య సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.