– యూపీలో ఆపకుండా మూడు కి.మీ…
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ వ్యక్తి మద్యం మత్తులో కారు నడుపుతూ మరో వ్యక్తి కారు బానెట్‌పై వేలాడుతున్నా పట్టించుకోకుండా మూడు కి.మీ. అలాగే వెళ్లిపోయాడు. ఇది గమనించిన స్థానికులు కారును వెంబడించి అడ్డుకొని పోలీసులకు సమాచారం అందించారు. బాధితుడిని నోయిడాకు చెందిన రమేశ్ కుమార్‌గా గుర్తించారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు తన కారును వెనుక నుంచి తాకడంతో ప్రశ్నంచడానికి అతని దగ్గరకు వెళ్లానని చెప్పాడు. తాను మాట్లాతున్నా పట్టించుకోకుండా సదరు వ్యక్తి కారును ముందుకు పోనిచ్చాడని, దానితో తాను కారు బానెట్‌పైకి ఎక్కానని అయినా కూడా అలాగే మూడు కిలో మీటర్ల మేర ఆపకుండా వెళ్లిపోయాడని వాపోయాడు. సంఘటనా స్థలంలోని సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. కారును సీజ్ చేశామన్నారు. నిందితుడి వివరాలు తెలియాల్సి ఉంది.