
కారు, బైక్ ఢీకొనగా ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన మండలంలోని రామంజపురం స్టేజి సమీపంలో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రామంజపురం గ్రామానికి చెందిన అక్కిరెడ్డి లింగారెడ్డి తన ఇంటి నుండి వడ్ల కొనుగోలు కేంద్రం వద్దకు వెళుతుండగా సూర్యాపేట నుంచి మరిపేడ కు వెళుతున్న కారు ద్విచక్ర వాహనంపై వెళుతున్న అక్కిరెడ్డి లింగారెడ్డి ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కిరెడ్డి లింగారెడ్డి కి తీవ్ర గాయాలయ్యాయి. కాగా స్థానికులు, కుటుంబ సభ్యులు, తొర్రూర్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు వారు తెలిపారు.