కోతుల దాడిలో వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన జన్నారం మండలంలోని కవ్వాల్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కవ్వాల్ గ్రామానికి చెందిన పోడేటి పోచ గౌడ్ ఆదివారం తన ఇంటి వద్ద పనులు చేస్తుండగా కోతుల గుంపు వచ్చి అతనిపై దాడి చేశాయి. ఈ దాడిలో అతని చేతులు కాళ్లు తలపై కోతులు తీవ్రంగా కొరకడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వారి కుటుంబ సభ్యులు అతన్ని హుటాహుటిన చికిత్స నిమిత్తం జన్నారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో మెరుగైన చికిత్స కోసం అతనిని మంచిర్యాల్ ఆసుపత్రికి తరలించినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు.. కవ్వాల్ గ్రామంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో కోతుల బెడద ఎక్కువగా ఉందని అటవీ అధికారులు స్పందించి వెంటనే కోతులను నివారించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.