
రోడ్డు ప్రమాదం జరిగి వ్యక్తి రెండు కాళ్ళు విరిగిన సంఘటన మండల పరిధిలోని దుపహడ్ గ్రామంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ పెరిక రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని దుపహడ్ గ్రామానికి చెందిన కొప్పోజు గోపయ్యచారి శనివారం రాత్రి సుమారు 7 గం.ల సమయంలో గ్రామంలోని ప్రధాన రహదారిపై రోడ్డు దాటుతుండగా గరిడేపల్లి నుండి సూర్యాపేట వెళ్తున్న లారీ తగిలి కిందపడగా తన రెండు కాళ్ళమీద నుండి లారీ ముందు కుడివైపు చక్రాలు దాటడంతో రెండు కాళ్ళు విరిగిపోయాయి. వెంటనే బాదితున్ని అంబులెన్సులో చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధితుని భార్య శ్రీహర్షిత కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.