మన ఊరు మనబడి – మన బస్తి మనబడి కార్యక్రమం దేశానికి ఆదర్శం

– తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు మన బడి కార్యక్రమానికి రూ. 7250 కోట్ల రూ.ఖర్చు

– మనబడి మన బస్తి మనబడి కార్యక్రమం చాలా సంతృప్తినిచ్చింది
– మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలలకు మహర్దశ
– విద్యార్థులంతా ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలపడం అభినందనీయం
– మన ఊరు మన బడి పాటశాలల ప్రారంభోత్సవం లో ఎమ్మెల్యే గణేష్ బిగాల 
నవతెలంగాణ – కంటేశ్వర్
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు-విద్య విద్య దినోత్సవాల్లో పురస్కరించుకుని మన ఊరు మన బడి-మన బస్తీ మన బడి కార్యక్రమంలో అభివృద్ధి చేసిన ప్రభుత్వ పాఠశాలలను మంగళవారం ప్రారంభించారు. ఎల్లమ్మ గుట్ట ప్రాథమిక పాఠశాల 25.8 లక్షల రూ, వినాయక్ నగర్ ప్రాథమిక పాఠశాల 30.81 లక్షల రూ,వెంగల్ రావు నగర్ ఉన్నత పాఠశాల 53.20 లక్షల రూ, ఈ సందర్భంగా ఎమ్మెల్యే  గణేష్ బిగాల మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లో విద్య శాఖ ప్రగతి పథంలో ముందుకెళ్తుంది.మన ఊరు మన బడి/మన బస్తి మన బడి కార్యక్రమం ద్వారా సరి కొత్త హంగులతో ప్రభుత్వ బడులు స్వాగతం పలుకుతున్నాయి.ఆంగ్ల మాధ్యమం లో బోధన,సైన్స్ ప్రయోగాలు,డిజిటల్ వనరులతో కార్పొరేట్ ధీటుగా ప్రభుత్వ బడుల్లో విద్య ను అందిస్తుంది ప్రభుత్వం. ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకు సన్న బియ్యం తో మధ్యాహ్న భోజనం అందిస్తున్నాము. నేటి నుండి ప్రభుత్వ బడుల్లో రాగి జావా అందించడానికి శ్రీకారం చేస్తున్నాము.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు మనబడి- మన బస్తి మన బడి కార్యక్రమానికి రూ. 7250 కోట్లు ఖర్చు పెడుతుంది.నాడు సమైక్య పాలనలో మూలన పడ్డ పాఠశాలలు నేడు సరి కొత్త కల సంతరించుకున్నాయి.ప్రభుత్వ బడుల్లో చదుకున్న విద్యార్థులు పోటీ పరీక్షలలో, క్రీడా పోటీలలో రాణిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు మీకు ఉన్న వనరులన్ని ఉపయోగించుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్, నుడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సుజిత్ సింగ్ ఠాకూర్, సత్య ప్రకాష్, దండు శేఖర్, సిర్ప రాజు, పంచారెడ్డి నర్సు భాయి సూరి, పోతుల పురుషోత్తం, మాకు రవి, ముక్తార్ తదితరులు పాల్గొన్నారు.