పలు ప్రైవేట్ స్కూళ్లలో విద్యార్థులపై జూలుం చూపిస్తున్న యాజమాన్యం

నవతెలంగాణ –  కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్ స్కూళ్లలో విద్యార్థులపై, తల్లిదండ్రులపై పాఠశాల యాజమాన్యాలు జులుం చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది పాఠశాలల విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాలలకు పిలిపించి మరి తప్పు చేసిన చేయకుండా పాఠశాలలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల రూపంలో భయభ్రాంతులకు తల్లిదండ్రులను విద్యార్థులను గురిచేస్తూ ఇబ్బందులకు పాల్పడుతున్నారు. జిల్లా కేంద్రంలోని చదువుతున్న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థి, విద్యార్థినిలను గురిచేస్తూ ఏదైనా అడుగుతే చదవడం లేదని సాగు చూపుతూ ఇంకా ఏమైనా అడుగుతే మీ పిల్లవాడు మీ అమ్మాయి అల్లరి చేస్తున్నారని వంకలు పెట్టుకొని పలు పాఠశాలల యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. ఈ విషయంలో నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి నిమ్మకు నీరు ఎత్తినట్టు వ్యవహరిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి ప్రైవేట్ పాఠశాలలపై బాధ్యత ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ ఆ పద్ధతిని వ్యవహరించకుండా కేవలం ప్రభుత్వ పాఠశాలలపై ప్రస్తుతం ఏర్పడిన ప్రభుత్వం నియమ నిబంధనల ప్రకారం వ్యవహరిస్తున్నారని తెలిసింది. కానీ ప్రైవేట్ పాఠశాలలపై ఎందుకు ఇంత నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నది ప్రశ్నార్థకంగా మిగిలింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పేరొందిన పాఠశాలలు ఇందులో ఉండడం గమనార్హం. ఒకసారి పాఠశాలలో అడ్మిషన్ తీసుకున్న విద్యార్థి విద్యార్థినిలు నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినప్పుడే పాఠశాల నుండి తొలగించాల్సిన లేదా వాటికి సంబంధించిన ఆధారాలతో నిరూపించాల్సిన బాధ్యత పాఠశాలల యాజమాన్యానికి ఉంది. కానీ ప్రస్తుతం పాఠశాలల యాజమాన్యాలు అలాగే విద్యాశాఖ అధికారులు వారికి తొత్తులుగా పనిచేస్తూ వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఒకవేళ తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలలో యాజమాన్యాలు చెప్పినట్టు వినకుంటే ప్రస్తుతం తీసివేసేందుకు శ్రీకారం చుట్టారు.విద్యారంగ సమస్యలపై నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి తమ విధులు ఏ విధంగా నిర్వహిస్తున్నారు, అసలు ప్రైవేట్ పాఠశాలలలో ఏం జరుగుతుంది అనేది తుతూ మంత్రంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కరోనా నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఎప్పుడైతే పాఠశాలలకు సంబంధించి విద్యార్థిని విద్యార్థులకు ఫోన్లను ఉపయోగించి క్లాసులను చేద్దామని నిర్ణయించడం తీసుకున్న విషయం మంచిదే కానీ దానివలన ఎలాంటి తప్పుదోవలు పడుతున్నారో పాఠశాలల యాజమాన్యాలు కానీ అధ్యాపక బృందంగానే పట్టించుకోకపోవడం గమనార్హం. అయితే ఇందులో పలు పాఠశాలలు నిజామాబాదులో పేరు ఉంది ఉన్నాయి అందులో నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి వారికి మద్దతు తెలపడం ఎంతవరకు సమంజసం అని తల్లిదండ్రుల నుండి అలాగే పాఠశాలలో పనిచేస్తున్నటువంటి అధ్యాపక బృందం నుండి సమాచారం వస్తూ ఎందుకు ఇలా చేస్తున్నారని తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే పాటశాలలో తమ విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు ఇలా టార్చర్ పెడితే మేము ఎందుకు పనిచేయాలి అని వాపోతున్నారు. ఈ విషయమై విద్యాశాఖ అధికారులతో పాటు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం తప్పకుండా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని కోరుతున్నారు. అలాగే విద్యార్థినిల తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో బాధపడుతున్నారు.