గాంధారి మండల కేంద్రంలో బడిబాట కార్యక్రమం నిర్వహణ

నవతెలంగాణ-గాంధారి : గాంధారి మండల కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించడం కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు ఈ సందర్భంగా గాంధారి సర్పంచ్          మామ్మాయి సంజీవ్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం అన్నిసౌకర్యాలు కల్పిస్తుందని శిక్షణ పొందిన ఉపాధ్యాయులు అందుబాటులో ఉంటారని ప్రజలు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ సేవ్ల తదితరులు పాల్గొన్నారు