మర్కోడులో హెల్త్ క్యాంప్ నిర్వహణ

నవతెలంగాణ – ఆళ్ళపల్లి
ప్రస్తుత సీజన్లో రోజురోజుకూ పెరుగుతున్న విషజ్వరాల నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా మండల పరిధిలోని మర్కోడు గ్రామం పల్లె దవాఖానలో శుక్రవారం హెల్త్ క్యాంప్ నిర్వహించి, ప్రజలకు హెల్త్ ఎడ్యుకేషన్ కల్పించడం జరిగిందని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి అర్వపల్లి రేవంత్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ వైద్య శిబిరానికి 75 మంది రోగులు వచ్చి, సంబంధిత ఆరోగ్య పరీక్షలు చేయించుకుని, తగిన మందులు, చికిత్స పొందారని, వారికి తగిన ఆరోగ్య, వాతావరణం, పరిసరాల జాగ్రత్తలు, సరైన ఆహార సూచనలు ఇవ్వడం జరిగిందని వైద్యాధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ రమాదేవి, వైద్య సిబ్బంది నరేష్, రమేష్, ఆశ వర్కర్ పాల్గొన్నారు.