జిల్లాస్థాయిలో టూ కే రెడ్ రన్ నిర్వహణ 

Management of Two Kay Red Run at district level– విజేతలకు బహుమతుల ప్రధానం 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
యూత్ ఫెస్ట్ 2024 లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యువజన దినోత్సవ సందర్భంగా నిజామాబాదు లోని జిల్లా స్థాయి లో ఏర్పాటుచేసిన 2కే రెడ్ రన్ కళాశాల బాలుర విభాగంలో  గిరిరాజ్ గవర్నమెంట్ కాలేజీ తరపున మొదటి స్థానం , రెండవ స్థానం  మూడవ స్థానం బహుమతులు గా జ్ఞానేశ్వర్,అజయ్, వినోద్ లు కైవసం చేసుకున్నారు. అలాగే బాలిక ల విభాగంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళ  డిగ్రీ కాలేజ్ లో చదువుతున్న విద్యార్థి  రోజా, అఖిల, వైష్ణవి లు గెలుపొందారు. ఈ కార్యమానికి ముఖ్య అతిధి గా హాజరైన అడిషనల్ జిల్లా వైద్య ఆరోగ్యాదికారి(Adl. DM&HO) డాక్టర్ దేవి నాగేశ్వరి మెడల్స్ తో విద్యార్థిని, విద్యార్థులను సత్కరించారు. అందుకు గాను గెలుపొందిన వారికి 1000, 750, 500 నగదు తో పాటు మేమొంటో, సర్టిఫికేట్ లు ప్రపంచ ఎయిడ్స్ డే రోజున అందజేస్తామని తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.  విద్యార్థులు అందరూ ఎయిడ్స్ పట్ల అవగాహనా పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి గిరిరాజ్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ రఫీక్, జిల్లా టిబి కో ఆర్డినేటర్ రవిగౌడ్, జి జి కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ బాలమణి, మహేష్, స్రవంతి, లక్ష్మి, దేవేందర్, గౌతమీ మరియు సుధాకర్ పాల్గొన్నారు.