నూతన ఎస్డీఎల్‌ యంత్రాలను ప్రారంభించిన మేనేజర్‌

నవతెలంగాణ-నస్పూర్‌
శ్రీరాంపూర్‌ ఏరియాలోని ఎస్‌ఆర్పి 3,3ఏ గనికి వచ్చిన నూతన ఎస్‌డీఎల్‌ యంత్రాలను గని మేనేజర్‌ సంతోష్‌ కుమార్‌ బుధవారం పూజా కార్యక్రమాన్ని నిర్వహించి ప్రారంభించారు. అనంతరం భూగర్భ గని లోనికి పంపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా గనికి ఆరు ఎస్డిఎల్‌ యంత్రాలు వచ్చాయని వాటి విలువ సుమారు రూ. కోట 55 లక్షలవిలువ ఉంటుందని అన్నారు. నూతన యంత్రాల రాకతో కార్మికులు స్ఫూర్తిదాయకంతో పని చేస్తారన్నారు. ఈ సందర్బంగా సింగరేణి యాజమాన్యంలోని ఉన్నతాధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎస్డిఎల్‌ యంత్రాలతో నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని గని చేరుకోవాలని ఆయన ప్రతి ఉద్యోగిని, ప్రతి అధికారిని, ప్రతి యూనియన్‌కు దిశా నిర్దేశం చేశారు. ఉత్పత్తి లక్ష్యసాధనలో కలిసికట్టుగా రక్షణతో తమ విధులను నిర్వహించి వరుసగా లక్ష్యాలను సాధించాలని, ఇదే ఒరవడిని భవిష్యత్తు లో కొనసాగించి గనిని ముందు వరుసలో నిలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో రక్షణాధికారి శ్రీధర్‌, పిట్‌ సెక్రెటరీ మురళీ చౌదరి, సంక్షేమ అధికారి గౌస్‌ పాషా, పిట్‌ ఇంజనీర్‌ ప్రేమ్‌ కుమార్‌, సాయి శ్రావణ్‌ పాల్గొన్నారు.