నిజామాబాద్ పర్యటనలో భాగంగా కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి కి గురువారం రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి స్వాగతం పలికి సన్మానించారు.అదేవిధంగా వ్యవసాయ కమిషన్ సభ్యులు కేవీఎన్ రెడ్డి, భవనీ రెడ్డి, రాం రెడ్డి గోపాల్ రెడ్డి, గడుగు గంగాధర్ లను సన్మానించారు.వీరితో పాటు రాష్ట్ర వితనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి,కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెం నర్సయ్య,జిల్లా ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు వేణు రాజ్,వేల్పూరు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సారెడ్డి,జిల్లా ఓబీసీ అధ్యక్షులు రాజ నరేందర్ గౌడ్,జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి భూమా రెడ్డి, ఎన్ ఎస్ యు ఐ నాయకులు శివ,చింటూ తదితరులు పాల్గొన్నారు.