
ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన బద్దం లింగారెడ్డి తల్లి ఇటీవలే మరణించడంతో ఆయన కుటుంబాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,రాష్ట్ర కో-ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి పరామర్శించారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రేండ్ల రమేష్ , మండల మైనార్టీ అధ్యక్షులు మునిరోద్దీన్,బాల్కొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆడేం గంగాప్రసాద్ , జిల్లా జనరల్ సెక్రెటరీ రవి రెడ్డి , నాయకులు గజేంధర్ , చిన్న సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.