సూర్య ఆరోగ్య సంస్థ బ్రోచర్లను విడుదల చేసిన మానాల 

Manala released brochures of Surya Arogya Sansthanనవతెలంగాణ – కంఠేశ్వర్ 
సూర్య ఆరోగ్య సంస్థ ప్రతినిధులు,  తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్, మానాల మోహన్ రెడ్డి ని, సూర్య ఆరోగ్య సంస్థ  చైర్మన్ భగవాన్, సి వో వో  రాజేంద్ర కుమార్ విక్రమ్,  ఫీల్డ్ కో ఆర్డినేటర్ వినోద్ కుమార్ లు మర్యాదపూర్వకంగా కలిసి చైర్మన్ మానాల మోహన్ రెడ్డి ని ఘనంగా ఆదివారం సన్మానించారు. మొదట చైర్మన్ మోహన్ రెడ్డి తో సంస్థ యొక్క బ్రోచర్లను విడుదల చేయించారు.  అనంతరం సూర్య ఆరోగ్య సంస్థ చేస్తున్నటువంటి  ఆరోగ్య శిబిరాలు, టీబి పరీక్షలు, హెచ్ఐవి పరీక్షలు, వ్యాధిగ్రస్తులకు అందిస్తున్న పౌష్టిక ఆహార కిట్ల గురించి, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు  ఉచిత కంటి పరీక్షలు,  దంత పరీక్షల, అద్దాల పంపిణీ, ఆరోగ్య అవగాహన కార్యక్రమాల గురించి, సంస్థ సి వో వో రాజేంద్ర కుమార్ విక్రమ్ చైర్మన్ మోహన్ రెడ్డి కి క్లుప్తంగా వివరించారు. సూర్య ఆరోగ్య  సంస్థకు  పూర్తి సహకారం అందిస్తామని, చైర్మన్ మోహన్ రెడ్డి  ఆరోగ్య సంస్థకు  హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లయన్స్ సహార ప్రెసిడెంట్ నరసింహారావు, ధనుంజయ రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.