
మండలంలోని ఉప్లూర్ లో గురువారం బాధిత కుటుంబాలను రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి పరామర్శించారు. గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు అవారి మురళి, మాజీ ప్రభుత్వ న్యాయవాది అవారి రమేష్ వాళ్ళ నానమ్మ అవారి గంగుబాయి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. వారిని, వారి కుటుంబ సభ్యులను మోహన్ రెడ్డి పరామర్శించారు.గ్రామానికే చెందిన ఆర్టీసీ కండక్టర్ ఎనుగందుల వేణు తండ్రి గంగాధర్ నాలుగు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. వేణు, కుటుంబ సభ్యులను మోహన్ రెడ్డి పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అనారోగ్యాల గల కారణాలను మృతుల కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రభుత్వ అదనపు న్యాయవాది సరసం చిన్నారెడ్డి, నాయకులు బద్దం రమేష్ రెడ్డి, అబ్దుల్ రఫీ, కొమ్ముల రవీందర్, బుచ్చి మల్లయ్య, కిషన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బోనగిరి భాస్కర్, ఎనుగందుల శైలేందర్, ఊట్నూరి ప్రదీప్, కొమ్ముల వెంకట్, చింతకుంట శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.