ఏమైందో మనసే..

‘మెరిసే మెరిసే’ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన పవన్‌ కుమార్‌ కొత్తూరి సక్సెస్‌ అందుకున్నారు. ఆయన తన రెండో సినిమా ‘యావరేజ్‌ స్టూడెంట్‌ నాని’తో హీరోగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌ మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఆగస్ట్‌ 2న విడుదల కాబోతోంది. పీవీఆర్‌ ఐనాక్స్‌ పిక్చర్స్‌ ద్వారా ఈ చిత్రం థియేటర్లోకి రానుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ జోరుగా సాగుతున్నాయి. గతంలో విడుదల చేసిన కాన్సెప్ట్‌ పోస్టర్‌, మోషన్‌ పోస్టర్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌, ఫస్ట్‌ సింగిల్‌కు సూపర్బ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఫస్ట్‌ సింగిల్‌లోనే తన ఎక్స్‌ప్రెషన్స్‌, పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు పవన్‌ కుమార్‌. గురువారం ఈ చిత్రంలోని సెకండ్‌ సింగిల్‌ ‘ఏమైందో మనసే’ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. పూర్తి రొమాంటిక్‌ మోడ్‌లో సాగే ఈ మెలోడీ పాటకు కార్తీక్‌ బి కొడకండ్ల మంచి బాణీని అందించారు. శక్తి శ్రీ గోపాలన్‌ గానం వినసొంపుగా ఉంది. కృష్ణవేణి మల్లవజ్జల సాహిత్యం ఆకట్టుకునేలా ఉంది. ఈ పాటలో పవన్‌, సాహిబా భాసిన్‌ స్టీమీ కెమిస్ట్రీ అదిరిపోయింది అని చిత్ర యూనిట్‌ తెలిపింది. పవన్‌ కుమార్‌ కొత్తూరి, స్నేహ మాల్వియ, సాహిబా భాసిన్‌, వివియా సంత్‌, ఝాన్సీ, రాజీవ్‌ కనకాల, ఖలేజా గిరి, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డిఓపం : సజీష్‌ రాజేంద్రన్‌, ఎడిటర్‌: ఉద్ధవ్‌, కొరియోగ్రఫీ: రాజ్‌ పైడి మాస్టర్‌, ఫైట్స్‌: నందు.