మనశ్శాంతి కోవెల (సాంఘిక నవల) ఈ నెల 4వ తేదిన ఆవిష్కరణ

నవతెలంగాణ –  కంటేశ్వర్
ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మద్దుకూరి సాయిబాబు రచించిన మనశ్శాంతి కోవెల (సాంఘిక నవల) పుస్తకావిష్కరణ కార్యక్రమం ఈ నెల 4వ తేది ఆదివారం సాయంత్రం 4గం,లకు హోటల్ వంశీ ఇంటర్నేషనల్ నందు నిర్వహించడం జరుగుతుందని కవి, రచయిత మద్దుకూరి సాయిబాబు శుక్రవారం తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టి.చిరంజీవులు ఐ.ఏ.ఎస్ విశ్రాంత పూర్వ కార్యదర్శి తెలంగాణ ప్రభుత్వం కీలకోపన్యాసం డా.నాళేశ్వరం శంకరంసభాఅద్యక్షులు  ఘనపురం దేవేందర్ హరిదా రచయితల సంఘం అధ్యక్షులు,విశిష్ట అతిథులుగా పి.వి దుర్గా ప్రసాద్ కల్నల్ విశ్రాంత ఇండియన్ ఆర్మీ  మరియు ఐ.గోపాల్ శర్మ సీనియర్ న్యాయవాది హైకోర్టు అలాగే విశిష్ట అతిథులుగా ప్రముఖ రచయిత్రి డా.అమృతలత, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్, తెలంగాణ రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్, ఆత్మీయ అతిథులుగా డా.వంగరి త్రివేణి, డా.కాసార్ల నరేష్ రావ్, గంట్యాల ప్రసాద్, తిరుమల శ్రీనివాస్ ఆర్య , కంకణాల రాజేశ్వర్ హాజరవుతారని తెలిపారు కావున జిల్లాలోని కవులు,రచయితలు,కళాకారులు, స్వచ్చంద సేవా సంస్థల ప్రతినిధులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.