మంచిరెడ్డి కిషన్‌ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలి

– బీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి కాట్రోత్‌ బహదూర్‌,
– యువజన విభాగం మండలాధ్యక్షులు వనపర్తి బద్రీనాథ్‌ గుప్తా
నవతెలంగాణ-మంచాల
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే కారు గుర్తుకు ఓటేసి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి కాట్రోత్‌ బహ దూర్‌, యువజన విభాగం మండల అధ్యక్షులు వనపర్తి బద్రీనాథ్‌ గుప్త అన్నారు. శనివారం మండల పరిధిలోని సత్తి తండాలో నిర్వహించిన బూత్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. అంతేగాక రైతులకు రైతుబంధు, రైతుబీమా పథకాలు అమలు చేస్తూ, భరోసా కల్పిస్తుందన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే కారు గుర్తుకు ఓటేసి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ పెంట్యా నాయక్‌, రఘునాయాక్‌, నాయకులు లచ్చిరాం, సాగర్‌, కిషన్‌, వెంకటేష్‌, నితిన్‌ ఉన్నారు.