తిన్నడుగా మంచు అవ్రామ్‌

Manchu Avram as a eaterవిష్ణు మంచు నటిస్తూ నిర్మిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘కన్నప్ప’. కష్ణాష్టమి సందర్భంగా సోమవారం ఈ చిత్రంలోని స్పెషల్‌ క్యారెక్టర్‌ పోషించిన మంచు వారి మూడో తరం నుంచి అవ్రామ్‌ భక్త మంచు లుక్‌ను రిలీజ్‌ చేశారు. విష్ణు మంచు తనయుడు అవ్రామ్‌ భక్త మంచు ఈ సినిమాతో వెండితెరకు పరిచయం అవుతున్నారు. ఇందులో అవ్రామ్‌ క్యారెక్టర్‌కి సంబంధించిన పోస్టర్‌ను మోహన్‌ బాబు రిలీజ్‌ చేశారు. ఈ పోస్టర్‌లో అవ్రామ్‌ ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు. పోస్టర్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో కాళీమాత విగ్రహం డిజైన్‌ కూడా అదిరిపోయింది. తిన్నడు బాల్యానికి సంబంధించిన లుక్‌లో అవ్రామ్‌ ప్రేక్షకులను అలరించబోతున్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్‌ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్‌లో ఈ సినిమా పాన్‌ ఇండియా వైడ్‌గా విడుదల కానుంది.