కేంద్ర అత్యున్నత పురస్కరమైన పద్మశ్రీ అవార్డు ఎమ్మార్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను వరించడం యావత్తు మాదిగ జాతికే గర్వకారణమని కాటారం ఎమ్మార్పిఎస్ మండల అధ్యక్షుడు మంతెన చిరంజీవి మాదిగ అన్నారు. సోమవారం కాటారం మండలకేంద్రంలో మంద కృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు దక్కడం పట్ల హర్షం వ్యక్తంచేస్తూ ఎమ్మార్పిఎస్ శ్రేణులు,మాదిగ సోదరులు సంబరాలు చేసుకున్నారు.ఈ సందర్భంగా అంబేద్కర్ సెంటర్ వద్ద బాణాసంచా కాల్చి స్వీట్లు తినిపించుకున్నారు.అనంతరం మాట్లాడారు కులం పేరు చెబితేనే సిగ్గుగా భావించే పరిస్థితి నుండీ నేను మాదిగను అని గర్వంగా చెప్పుకునేలా చేసిన ఘనత మంద కృష్ణ మాదిగదేనని కొనియాడారు. కేవలం ఎమ్మార్పిఎస్ ఉద్యమాలే మాత్రమే కాకుండా ఆరోగ్య శ్రీ, ఫింఛన్లు పథకాల అమలుకై పోరుబాట సాగించాడని గుర్తుచేశారు.అదేవిధంగా తెలంగాణలో ఏబీసీడీ వర్గీకరణ అమలు చేయడమే ధ్యేయంగా ఫిబ్రవరి 7వ తేదీన నిర్వహించే వేయి గొంతులు లక్ష డప్పుల కార్యక్రమానికై మండలంలోని మాదిగ జాతి ప్రజానీకం తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో ఎమ్మార్పిఎస్ వర్కింగ్ గద్దల మహేష్,ఉపాధ్యక్షుడు చీపెల్లి చిన్ని,కడారి విక్రం, రామిళ్ల కిరణ్,కోటపర్తి శ్రీనివాస్,కొండయ్య, రాజేంద్ర ప్రసాద్, రామిళ్ల రాజు,సునీల్, సమ్మయ్య, స్వామి, బొడ్డు పోశయ్య,పొట్ట రమేష్,బాపు పాల్గొన్నారు.