
– మీ పోరాటానికి ఎమ్మార్పీఎస్ జీవితాంతం గుర్తిస్తుంది
– ర్యాలీలో ఎమ్మార్పీఎస్ నాయకులు కార్యకర్తలు మహిళలు
– డప్పులతో దద్దరిల్లిన లచ్చన్ గ్రామం
నవతెలంగాణ – మద్నూర్
ఎస్సీ వర్గీకరణ సాధించడానికి 30 సంవత్సరాల కాలంగా పట్టువిడని విక్రమార్కుడు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అని లచ్చన్ గ్రామ ఎమ్మార్పీఎస్ నాయకులు కార్యకర్తలు మహిళలు యువకులు కొనియాడారు. ఎస్సీ వర్గీకరణ అమలు కోసం సాధించిన విజయం మీ పోరాటానికి ఎమ్మార్పీఎస్ జీవితాంతం గుర్తిస్తుంది. అంటూ మద్నూర్ మండలంలోని లచ్చన్ గ్రామంలో ఎస్సీ వర్గీకరణ విజయోత్సవ ర్యాలీ డప్పులతో దద్దరిల్లింది ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి డబ్బులతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించి ఊరేగించారు. ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ప్రతినిధి విజయ్ మీరేవార్ సాయిలు భీమ్రావు యాదవ్ రావు సురేష్ మారుతి గంగారం యువకులు మహిళలు పాల్గొన్నారు.