నవతెలంగాణ – మల్హర్ రావు/కాటారం
మాదిగ,మాదిగ ఉపకులాల చిరకాల వాంఛ ఎస్సీ వర్గీకరణ సాధనకర్త మందకృష్ణ మాదిగ ఈ నెల 13వ తేదీన హైదరాబాద్ కు రానున్న నేపథ్యంలో స్వాగతోత్సవ ర్యాలీకై కాటారం మండలం నుండీ మాదిగ జాతి బిడ్డలు, మాదిగ ఉప కులాల ప్రజలు అధిక సంఖ్య లో తరలిరావాలని కాటారం ఎమ్మార్పిఎస్ మండల అధ్యక్షుడు మంతెన చిరంజీవి మాదిగ బుధవారం ఒక ప్రకటనలో కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మాదిగల ఆకాంక్షను సాధించిన వ్యక్తి మంద కృష్ణ మాదిగ గారని ఆయనకు స్వాగతం పలకడానికి తెలుగు రాష్ట్రాలోని నలుమూలల నుండీ మాదిగలు, మాదిగ ఉప కులాల ప్రజలు తరలివస్తున్నట్లు పేర్కొన్నారు. లక్షల డప్పులతో జరిగే జరిగే స్వాగత కార్యక్రమానికి ప్రతీ మాదిగ జాతి బిడ్డ తమ వంతు బాధ్యతగా తరలివచ్చి విజయవంతం చేయాలని చిరంజీవి మాదిగ పిలుపునిచ్చారు.