ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కు మద్దతు నుంచి వర్గీకరణను సాధిద్దామని బిసి కవులు కళాకారులు మేధావుల ఐక్యవేదిక కన్వీనర్ దరువు అంజన్న కోరారు. బుధవారం జన్నారం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎబిసిడి వర్గీకరణ కు అన్ని కమిషన్లు అనుకూలంగా చెప్పినప్పటికీ, సుప్రీంకోర్టు సైతం ఆగస్టు ఒకటో తారీఖున ఎస్సీ వర్గీకరణ జరగవలసిందని చెప్పినప్పటికీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా అమలు చేయడం లేదని కావున ఫిబ్రవరి ఏడవ తేదీన హైదరాబాద్ మహానగరంలో మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో తలపెట్టిన లక్ష డప్పులు,వేల గొంతుల మహా ప్రదర్శనకు బీసీలుగా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ఉద్యమకారుడు కవి మోహన్ బైరాగి మాట్లాడుతూ ఎస్సీ ఎబిసిడి వర్గీకరణ ప్రజాస్వామ్యకమైన డిమాండ్ అని దానిని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో క్రాంతి కళాబృందం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటాచారి, లింగంపల్లి రాజలింగం, టీఎంహెచ్డీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొండకూరి రాజు, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు కొండకూరి ప్రభుదాస్, ఆకుల నరసయ్య, కొండకూరి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.