– మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
మాదిగల ఉనికి చాటేందుకు అలుపెరుగని పోరాటాలు ఎన్నో చేశారని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు సావనపెళ్లి బాలయ్య అన్నారు. మాదిగల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించడం తో మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సోమవారం మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ… గత మూడు దశాబ్దాలుగా మాదిగల ఉనికి కోసం ఎన్నో ఉద్యమాలు చేశారని వారు పేర్కొన్నారు. అలాంటి మందకృష్ణ మాదిగ కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేసినట్లు ప్రకటించడం ఎంతో సంతోషకరమన్నారు.ఇట్టి కార్యక్రమంలో దుర్గయ్య ,నరసయ్య దేవయ్య, వెంకటేశ్వర్లు, నరేష్, గుండు ప్రేమ్ కుమార్,కిషన్, శ్రీను పాల్గొన్నారు.