ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ బిల్లుకు సుప్రీంకోర్టు ఆమోద ముద్ర వేయడంతో మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో డప్పు చప్పుళ్ళతో ఊరేగింపు నిర్వహించి నరేంద్ర మోడీ, మంద కృష్ణ మాదిగ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి పూలమాల వేసి హర్షం వ్యక్తం చేశారు.ఎస్సీ వర్గీకరణకు 30 సంవత్సరాలుగా అలుపెరుగని పోరాటం చేసి ఎన్నో అవమానాలను తట్టుకొని వర్గీకరణ కోసం బాటలు వేసిన మంద కృష్ణ మాదిగ కృషి పట్టుదలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. మంద కృష్ణ మాదిగ ఎమ్మార్పీఎస్ ను స్థాపించి మాదిగలకు ఉపకులాల హక్కులకై ఎన్నో పోరాటాలు చేసిన ఉద్యమనాయకుడు ప్రభుత్వ పథకాలు, ఉద్యోగాలు అన్ని వర్గాల ప్రజలకు దక్కాలని మందకృష్ణ పోరాటాన్ని గుర్తించిన ప్రధాని నరేంద్ర మోడీ వర్గీకరణకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ, 108 సేవలను అందించడానికి మందకృష్ణ మాదిగనే కారణమని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి శాసనసభలో తెలిపారని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో శంకర్,భోజన్న, లక్ష్మణ్, గణేష్, అశోక్,మోహన్,రవి, శ్రీకాంత్, అజయ్, సు రేష్, నాగేష్,మహేష్,రాజు, శ్యామ్, లక్ష్మణ్, తేజ, వినోద్ ఎమ్మార్పీఎస్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.