నవతెలంగాణ – ఆర్మూర్
కేంద్ర ప్రభుత్వం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ కు పద్మశ్రీ ప్రకటించడం హర్షనీయమని ఎమ్మార్పీఎస్ జిల్లా మాజీ అధ్యక్షులు మైలారం బాలు ఆదివారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా పోరాటం చేసినారని, ఎస్సీ వర్గీకరణ ఎస్సీలోని కులాలకు జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ తో 19 94 జులై ఓడిన ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ఈద్ ముడి గ్రామం నుంచి ఉద్యమ ప్రస్తావాన్ని ప్రారంభించిన అన్నారు .తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించి, మాదిగలకు రిజర్వేషన్లు అమలు చేయాలని అంశాన్ని ప్రచారం చేసి మాదిగలు ఉపకులాల ప్రజలను చైతన్యపరిచినారని అన్నారు. ఫిబ్రవరి 7న హైదరాబాదులో నిర్వహించే 1000 గొంతులు.. లక్ష డప్పులు.. కార్యక్రమానికి ప్రతి మాదిగ డప్పుతో కదలి రావాలని, ఆవేదన శబ్దం ప్రపంచానికి తెలిసేలా దండోరా వేయాలన్నారు.