ఈ నెల 25న సిద్దిపేటలోని వయోల గార్డెన్స్ లో జరిగే ‘వెయ్యి గొంతులు లక్ష డప్పుల’ సన్నాహక సమావేశానికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ముఖ్యఅతిథిగా విచ్చేయనున్నారని ఎమ్మార్పీఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు పెర్క పరశురామ్ మాదిగ తెలిపారు. గురువారం దుబ్బాకలోని డా.బాబు జగ్జీవన్ రామ్ సంఘంలో వారు మాట్లాడారు. ఫిబ్రవరి 7 న జరగబోవు ‘వెయ్యి గొంతులు లక్ష డప్పుల’ మహా ప్రదర్శన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ మందకృష్ణ మాదిగ రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు కొనసాగిస్తున్నాడని, దుబ్బాక నియోజకవర్గంలోని మాదిగ, మాదిగ ఉప కులాలకు చెందిన నాయకులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు.ఎంఆర్ పీఎస్ సీనియర్ నాయకులు ఇస్తారిగల్ల ఎల్లం, ఇస్తారిగల్ల యాదగిరి,మోత్కుపల్లి బద్రి,బెల్ల రమేష్, చెక్కపల్లి మహేష్, దొమ్మాట స్వామి, చెక్కపల్లి సుధాకర్, లింగన్నపేట శ్రీకాంత్, ఇస్తారిగల్ల నరసింహులు, ఇస్తారిగల్ల వంశీ, బెల్లె సాయి ఉన్నారు.