
గాంధారి మండలంలోని నాగ్లుర్ గ్రామంలో సోయా, వరి, మొక్క జొన్న పంటలనుమండల వ్యవసాయ అధికారి నరేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరుసగా కురిసిన వర్షాలకు పంటలు కొద్దిగా ఎరుపుగా మారి పంట ఎదుగుదల మందగించడం జరిగింది. దీని నుండి పంటలను కపుడుకోవడనికి 13.0.45 ఎకరానికి ఒక కేజీ మరియు ఫార్ములా 4 ఎకరానికి 400 నుండి 600 గ్రాములు వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేసి పంటలను కాపాడుకోవచ్చు.అదేవిధంగా భూమిలో యూరియా 25కేజీలు, పొటాష్ 15 కేజీలు కలిపి ఎకరానికి వేస్తే పంటలుత్వరగా కొలుకుంటుందని ఆయన రైతులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ ఈ ఓ ఆరతి మరియు రైతులు పాల్గొన్నారు.