నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండల ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం మండల కేంద్ర శివారులోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో నిర్వహించిన మండల కార్యవర్గ సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు నూతన కార్యవర్గం ఎన్నుకున్నారు. మండల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షులుగా దంతుల రమణయ్య, మండల ఉపాధ్యక్షులుగా బెజగం వెంకటేష్, కార్యదర్శిగా జొన్నల భూషణ్, కోశాధికారిగా కటకం భాస్కర్, ముఖ్య సలహాదారులుగా చిటికేసి గంగాధర్, మార్యాల నాగభూషణం, ఆమేడ నరేందర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మండల నూతన ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా ఎన్నికైన దొంతుల రమణయ్య మాట్లాడుతూ ఆర్యవైశ్యుల అభ్యున్నతి కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. తన ఎన్నికల సహకరించిన మండల ఆర్యవైశ్య సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మండల అధ్యక్షులుగా ఎన్నికైన రమణయ్య ను మండల సంఘ సభ్యులు అభినందించి, శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు నల్ల గణేష్ గుప్తా, చిటికేసి రఘు, జొన్నల చిన్న భూమయ్య, ఆమెటి శంకర్, నీలి గోపాల్, తదితరులు పాల్గొన్నారు.