నవతెలంగాణ- చిట్యాల టౌన్: చిట్యాల పట్టణ శివారులోని తన వ్యవసాయ క్షేత్రంలో తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ని చిట్యాల మండలానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తనపై అభిమానంతో భారీగా వచ్చిన అభిమానులకు, నేతలకు, కార్యకర్తలకు గుత్తా సుఖేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వనమా వెంకటేశ్వర్లు, పట్టణ పార్టీ అధ్యక్షులు పొన్నం లక్ష్మయ్య, కౌన్సిలర్లు బెల్లి సత్తయ్య, కోనేటి కృష్ణ, పార్టీ నాయకులు గోధుమ గడ్డ జలంధర్ రెడ్డి, జమాండ్ల శ్రీనివాస్ రెడ్డి, జిట్ట చంద్రకాంత్, చిత్రగంటి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.