వరద బాధితులకు మండల కాంగ్రెస్ వితరణ..

– 62 వేల నగదు, 5 క్వింటాల్ల బియ్యం అందజజేత
నవతెలంగాణ-మంగపేట
భారీ వర్షాలకు వచ్చిన వరదలతో ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామంలో చనిపోయిన, ఆస్తి నష్టపోయిన కుటుంబాలను ఆదుకునేందుకు ములుగు ఎమ్మెల్యే సీతక్క ఇచ్చిన పిలుపు మేరకకు మండల కాంగ్రెస్ పార్టీ నుండి ప్రతి కాంగ్రెస్ కుటుంబ సభ్యుడు తన వంతుగా ఆదుకునేందుకు ముందుకు వచ్చినట్ కాంగ్రెస్ ఎస్టీ సెల్ జిల్లా అద్యక్షుడు గుమ్మడి సోమయ్య తెలిపారు. మంగళవారం పార్టీ నాయకుల నుండి సేకరించిన 62 వేల నగదు, 5 క్వింటాల్ల బియ్యాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సీతక్కకు అందజేసినట్లు సోమయ్య తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రచార కమిటీ చైర్మన్ పూజారి సురేంద్రబాబు, జిల్లా ఆర్టిఐ చైర్మన్ బండ జగన్ మోహన్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్ కోడం బాలక్రిష్ణ, జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి పెద్ది నర్సింహారావు, మండల ప్రధాన కార్యదర్శి కారుపోతుల నర్సయ్య గౌడ్, ఉపాధ్యక్షుడు గాదె శ్రావణ్ కుమార్, మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు చాద మల్లయ్య, మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు టీవీ.హిదాయతుల్లా, బీసీ సెల్ మండల అధ్యక్షులు ముత్తినేని ఆదినారాయణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అయ్యోరి యానయ్య, సీతక్క యువసేన జిల్లా అధ్యక్షులు సిద్ధాబత్తుల జగదీష్, గ్రామ కమిటీ అధ్యక్షులు తాతినేని హరికృష్ణ, తూడి భగవాన్ రెడ్డి, ఆకు పవన్, తోట అశోక్ కుమార్, పోదెం నాగేష్, గంగినేని శేషగిరిరావు, కాటబోయిన నర్సింహారావు, బోడ సతీష్, బూర్గుల సతీష్ లు పాల్గొన్నారు