మాజీ ఎమ్మెల్యే వాస్తవాలు తెలుసుకోని మాట్లాడాలి: మండల కాంగ్రెస్ నాయకులు

నవతెలంగాణ – ముధోల్
మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ముధోల్ మాజీ ఎంపిపి ఎజాజ్ ద్దిన్, మండల కాంగ్రెస్ నాయకులు సురేందర్ రేడ్డి, పోతన్న యాదవ్లు సూచించారు. నియోజక వర్గం కేంద్రమైన ముధోల్ లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠ్ఠల్ రేడ్డి  ముధోల్ నియోజకవర్గ కేంద్రంను అభివృద్ధి చేయలేదని మాజీ ఎమ్మెల్యే నారాయణ రావు పటేల్ వ్యాఖ్యలు చేయడం సరికాదని వారు అన్నారు. ఓకే పార్టీ లో ఉంటు విమర్శించుకోవడంతో కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల్లో దెబ్బతింటుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతకుముందు ఉన్న బీటీ రోడ్డుపై సీసీ రోడ్డు700మీటర్లు వేసేయగానే ముధోల్ అభివృద్ధి జరిగిపోయింద అనివారు ప్రశ్నించారు.గతంలో మాజీ ఎమ్మెల్యే విఠల్ రేడ్డి హయాంలో 3 కోట్లతో ముధోల్లోని ప్రతి వీధిలో సిసి రోడ్ల నిర్మాణం పశుపతినాథ్ ఆలయం, ముక్తా దేవి ఆలయం, మార్కండేయ ఆలయాల నిర్మాణానికి 64 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించారని వారు గుర్తుచేశారు. 30 పడకల నూతన ఆసుపత్రి నిర్మాణానికి 8 కోట్ల నిధులు మంజూరు, మండల పరిషత్ కార్యాలయం నిర్మాణానికి 1 కోటి రూపాయల నిధులతో నూతనంగా నిర్మించడం జరిగింది. వారు తెలిపారు. ముధోల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నిర్మాణానికి 1 కోటి రూపాయలు నిధులతో నిర్మించారని అన్నారు. అలాగే గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల  కళాశాల యొక్క నిర్మాణానికి 9 కోట్ల నిధులు మంజూరు చెయించారన్నారు. మార్కెట్ కమిటీ గోదాం నిర్మాణానికి 4 కోట్లు, మన ఊరు మనబడి ద్వారా ఒక కోటి 10 లక్షల రూపాయల నిధులు, కేజీబీవీ అదనపు భవన నిర్మాణానికి రెండు కోట్ల 30 లక్షల నిధులు మంజూరు మిషన్ కాకతీయ ద్వారా మూడు చెరువుల పునరుద్ధరణకు 80 లక్షల నిధులు మంజూరు. రైతు వేదిక నిర్మాణానికి 20 లక్షల మంజూరు,షాదిఖానా నిర్మాణానికి 50 లక్షల రూపాయల మంజూరు, ముధోల్ నుండి తానూర్ వరకు డబుల్ రొడ్డు, ముధోల్ నుండి ఎల్వతు వరకు బీటీ రోడ్డు మంజూరు, బస్టాండు చౌరస్తా నుండి ప్రభుత్వ ఆసుపత్రి వరకు బైపాస్  రోడ్డు నిర్మాణం, ఎం జెపి బీసీ రెసిడెన్షియల్, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల కళాశాల మంజూరు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేయటం జరిగింది వారు తెలిపారు. మున్నూరు కాపు సంఘం, ముదిరాజ్ సంఘం, రజక సంఘం, యాదవ సంఘం, ఎస్సీ కమ్యూనిటీ, మైనార్టీ కమ్యూనిటీ హాల్స్ కి మాజీ ఎమ్మెల్యే విఠల్ రేడ్డి నిధులు మంజూరు చేశారన్నారు. పంట చేనులోనికి గ్రావెల్ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరుతో పాటు జర్నలిస్టుల ఇండ్ల నిర్మాణానికి ప్లాట్లు, గతంలో పంపిణీ చేయటం జరిగిందని వారు పేర్కొన్నారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయానికి స్థలం మంజూరు చేయటం జరిగింది వారు అన్నారు. పది సంవత్సంరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన ఎమ్మెల్యే విఠల్ రేడ్డి హయాంలో అభివృద్ధి పనులు జరిగాయని వారు స్పష్టం చేశారు. పలు అభివృద్ధి పనులు నేటికీ కోనసాగుతున్నయని వారు తెలిపారు. పనులు చేయించిన వారిని చేయలేదని విమర్శించడం తగదన్నారు. మాజీ ఎమ్మెల్యే నారాయణ రావు పటేల్కు అపార అనుభవం ఉండీ, సీనియర్ నాయకులు అయిన మీరు  మాట్లాడే ముందు తెలుసుకుని మాట్లాడాలని వారు హితవు పలికారు. ఒకే పార్టీ లో ఉండి ఒకరి పై ఒకరు విమర్శించు కోవటం మంచి సాంప్రదాయం కాదని వారు గుర్తు చేశారు. అందరం కలిసి కాంగ్రెస్ పార్టీ ని నియోజకవర్గం లో బలోపేతం చేసి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిద్దామని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం మాజీ మండల కోఆప్షన్ సభ్యులు సయ్యద్ ఖాలిద్, నాయకులు రాంరెడ్డి, ఆకుల శ్రీనివాస్ గౌడ్, షేమిమ్, మంత్రివార్ బాబు, కాంతారావు, తదితరులు పాల్గొన్నారు.