మండల కాంగ్రేస్ అధ్యక్షునిగా లక్ష్మా గౌడ్

నవతెలంగాణ – రామారెడ్డి
రామారెడ్డి మండల కాంగ్రేస్ అధ్యక్షునిగా, రామారెడ్డి గ్రామానికి చెందిన గొల్లపల్లి లక్ష్మా గౌడ్ ను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ఆర్డర్ కాపీని విడుదల చేశారు. గతంలో పోసానిపేటకు చెందిన శీల సాగర్ ను నియమించడంతో, నాయకులు, కార్యకర్తలు విముఖత చూపటంతో, అధిష్టానం పునర్ పరిశీలించి లక్ష్మణ్ గౌడ్ నియమించినట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ సందర్భంగా లక్ష్మా గౌడ్ ను నవతెలంగాణ సంప్రదించగా.. నాపై నమ్మకం ఉంచి, బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ పెద్దలకు, అండగా నిలిచిన నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కోసం ప్రతి ఒక్కరిని కలుపుకొని కార్యక్రమాలు నిర్వహిస్తానని, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ ఫలాలను, అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా, ప్రజల్లో ఉండి కష్టపడతానని అన్నారు.