పకడ్బందీగా మధ్యాహ్న భోజనం అందించాలి -మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్

 నవతెలంగాణ బాల్కొండ: మండల విద్యా వనరుల కేంద్రంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుల, మధ్యాహ్న భోజన ఏజెన్సీల సమన్వయ సమావేశాన్ని మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎం ఈ ఓ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు గానూ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని మండల విద్యా అధికారి సూచించారు.మధ్యాహ్న భోజన పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు గానూ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారాన్ని అందించాలని,58 ప్రాథమికోన్నత పాఠశాలలు, జడ్పీ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇందులో సుమారు 5 వేల మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు వచ్చే విధంగా ప్రోత్సహించడంతో పాటు పేద, మధ్యతరగతి విద్యార్థులు ఎక్కువగా వస్తారని భావించిన కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నాయి.


ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు కేంద్ర ప్రభుత్వం, 9, 10 తరగతుల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు పెట్టే భోజనం కోసం దొడ్డు బియ్యాన్ని ఇవ్వగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వాటి స్థానంలో సన్న రకం బియ్యాన్ని పంపిణీ చేస్తున్నది. దీంతో చాలా మంది విద్యార్థులు ఇళ్లకు వెళ్లకుండా పాఠశాలల్లోనే మధ్యాహ్న భోజనాన్ని తింటున్నారు. అయితే మధ్యాహ్న భోజనం పథకం సక్రమంగా అమలు ఈ నేపథ్యంలో విద్యాశాఖ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. . అలాగే వారానికి మూడు రోజులు సోమవారం, బుధవారం, శనివారం రోజున తప్పనిసరిగా ఉడక బెట్టిన కోడిగుడ్లను విద్యార్థులకు, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ హెచ్చరించింది. ఇప్పటి వరకు ఒక్కో కోడిగుడ్డుకు నాలుగు రూపాయలు ఇవ్వగా, ప్రస్తుతం దానిని ఐదు రూపాయలకు పెంచింది. పాఠశాలల్లో మూడురోజులు నిర్వాహకులు కోడిగుడ్లు పెట్టేలా చర్యలు తీసుకోవాలని మండల విద్యాశాఖ అధికారి ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. పాఠశాల గోడలపై పాత మెనూ కాకుండా కొత్త మెనూ వివరాలను రాయించాలని పేర్కొన్నారు. వారానికి మూడురోజులు కోడిగుడ్డు పెట్టే విధంగా నిర్వాహకులతో ఒప్పంద పత్రాన్ని రాయించాలన్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం వంటలు పూర్తయిన తర్వాత ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయుడు వంటల రుచిని చూసిన తర్వాతనే విద్యార్థులు విద్యార్థులకు వడ్డించాలన్నారు.
  పథకం అమలుకు మరిన్ని మార్గదర్శకాలు..
మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రతి పాఠశాలలో విద్యార్థులతో మధ్యాహ్న భోజన కమిటీని వేయాలని, వంట ఏజెన్సీకి బియ్యంతో పాటు ఇతర సరుకులు విద్యార్థుల కమిటీ సమక్షంలో తూకం వేసి ఇస్తూ వివరాలను రిజిష్టర్‌లో నమోదు చేయాలని పేర్కొంది. అన్ని పాఠశాలల్లో విధిగా మధ్యాహ్న పథకం అమలుకు సంబంధించిన రిజిష్టర్లు పక్కాగా నిర్వహించాలని, అధికారులు తనిఖీ చేసినప్పుడు రిజిష్టర్‌లోని వివరాలను పాఠశాలలోని బియ్యం నిల్వలకు తేడా ఉంటే ప్రధానోపాధ్యాయుడు బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆహారాన్ని వేడిగా వడ్డించడంతో పాటు శుద్ధ జలాలు సరఫరా చేయాలని, విద్యార్థులు ఎక్కడ పడితే అక్కడ భోజనం చేయకుండా ప్రత్యేక గదిలో ఏర్పాటు చేయాలన్నారు. భోజనానికి ముందు, తర్వాత విద్యార్థులు చేతులు శుభ్రం చేసుకునేందుకు సబ్బులు, నీటిని అందుబాటులో ఉంచాలని, నాణ్యమైన సరుకులను వంట ఏజెన్సీ వినియోగించేలా ప్రధానోపాధ్యాయులు చూడాలని పేర్కొన్నారు. ప్రతి రోజు భోజనాన్ని రుచి చూసి దానికి సంబంధించిన వివరాలు రిజిష్టర్‌లో నమోదు చేయాలని, ప్రధానోపాధ్యాయులు పాఠశాలలో కిచెన్‌ గార్డెన్లను ఏర్పాటు చేసి విద్యార్థులకు కూరగాయలను అందించాలని సూచించారు.