మండల రైతులు కాంగ్రెస్ లో చేరికలు

నవతెలంగాణ – మోర్తాడు

మండల కేంద్రంలోని మున్నూరు వాడ కాపు సంఘ సభ్యులు బాల్కొండ కాంగ్రెస్ నియోజకవర్గం ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి సమక్షంలో చేరిక అయ్యారు. బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్లో చేరినట్లు తెలిపారు. పార్టీలో చేరిక అవుతున్న రైతులకు పార్టీ కండువా కప్పి ఆహ్వానం పలికారు. రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని నమ్మకంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరిక అవుతున్నట్లు రైతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్నూరు వాడ రైతులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.