నవతెలంగాణ – జక్రాన్ పల్లి
వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ( ఆత్మ) సౌజన్యంతో ఈనెల 18న రాజేంద్రనగర్ హైదరాబాదులోని పిజెపిఎస్ ఏ యు కు జక్రాన్ పల్లి మండల రైతులు వెళ్లారు. వ్యవసాయ శాఖ నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో జిల్లాలోని రైతులందరిని ఒక బస్సు ద్వారా రాష్ట్రస్థాయి శిక్షణ ,విజ్ఞాన యాత్రకు వ్యవసాయ అధికారులు పంపించారు. జక్రం పెళ్లి మండలంలోని లక్ష్మాపూర్, నల్లగుట్ట తండా, చింతలూరు, జక్రాన్ పల్లి గ్రామాలకు చెందిన రైతులను వ్యవసాయ అధికారులు రాష్ట్ర స్థాయి శిక్షణ మరియు విజ్ఞాన యాత్రకు పంపించారు.