– ఎంపిటిసి సర్పంచ్ల ఆత్మీయ వీడ్కోలు సభకు నిధులు ఇచ్చిన అధికారులు
నవతెలంగాణ – శాయంపేట : శాయంపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, మండల ప్రాదేశిక సభ్యుల పదవీకాలం ఈనెల 3 న ముగిసింది. సర్పంచ్ల పదవీకాలం కూడా జనవరి 31 తో ముగిసిపోయింది. ఎంపీపీ తిరుపతిరెడ్డి అనివార్య కారణాల వలన దూరంగా ఉండటం, ఎంపిటిసిలు, సర్పంచులకు ఆత్మీయ వీడ్కోలు సమావేశానికి మండల పరిషత్ జనరల్ ఫండ్ నిధులు లేకపోవడంతో అధికారులు కార్యక్రమాన్ని చేపట్టలేదు. భూపాలపల్లి నియోజకవర్గంలోని మిగిలిన మండలాలలో ఆత్మీయ వీడ్కోలు సమావేశాలు నిర్వహించుకున్నారు. ఈ సమావేశానికి నిధులు లేకపోవడంతో ఎంపిడిఓ, ఐకెపి, ఈజీఎస్ కార్యాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీవో, ఏవో మండలాధికారులు ఇచ్చిన నిధులతో ఏట్టకేలకు సోమవారం ఎంపిటిసిలకు, సర్పంచులకు ఆత్మీయ వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేయగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఎంపీటీసీలను, సర్పంచ్ లను పూలమాలలు, శాలువ, మెమొంటోలతో సత్కరించారు. అనంతరం అందరికీ భోజన వసతి సమకూర్చారు. ఏట్టకేలకు ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించడంతో ఎంపిటిసిలు, సర్పంచులు హర్షం వ్యక్తం చేశారు.