ముఖ్యమంత్రిని కలిసిన మండల నాయకులు 

నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి, మండలంలోని ఉప్లూర్  గ్రామానికి చెందిన జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి శ్రీనివాస్ గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డితో కలిసి మండల కాంగ్రెస్ అధ్యక్షులు సుంకెట రవి, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి శ్రీనివాస్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని సూచించినట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు.