ఎమ్మెల్యే సీతక్కకు మండల నాయకుల ఘనస్వాగతం

సీతక్కకు పుష్పగుచ్చంతో స్వాగతం పలుకుతున్న నాయకులు
సీతక్కకు పుష్పగుచ్చంతో స్వాగతం పలుకుతున్న నాయకులు

నవతెలంగాణ-మంగపేట 
అమెరికాలో ‘తానా సభ’లకు వెళ్లి తిరిగివచ్చిన ములుగు ఎమ్మెల్యే సీతక్కకు మండల కాంగ్రెస్ నాయకులు శనివారం ఘనస్వాగతం పలికారు. కాంగ్రెస్ ఎస్టీ సెల్ జిల్లా అద్యక్షుడు గుమ్మడి సోమయ్య ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ నాయకులు ములుగు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఏఐసీసీ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మేల్యే దనసరి సీతక్కకు శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం గుమ్మడి సోమయ్య మాట్లాడుతూ వచ్చే సాదారణ ఎన్నికల్లో సీతక్కను మరో సారి భారీ మెజార్టీతో ములుగు ఎమ్మెల్యేగా గెలిపించుకుని వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిని చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారని తెలియజేశారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రచార కమిటీ చైర్మన్ పూజారి సురేందర్ బాబు, కాంగ్రెస్ మహిళా జిల్లా పార్టీ అధ్యక్షురాలు కొమరం ధనలక్ష్మి, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దీకొండ కాంతారావు, మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహబూబ్ ఖాన్, బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ద నరసింహారావు, మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు వెంగళ బుచ్చిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కారుపోతుల నరసయ్య గౌడ్, వర్కింగ్ ప్రసిడెంట్ నర్ర కిషోర్, మండల ఉపాధ్యక్షుడు గాదె శ్రావణ్, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోడెల నరేష్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు చాద మల్లయ్య, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు హిదాయతుల్ల, మల్లూరు దేవస్థానం మాజీ చైర్మన్ పూజారి సమ్మయ్య, సీతక్క యువసేన జిల్లా అద్యక్షులు సిద్దబత్తుల జగదీష్, ఎస్సి సెల్ మండల అధ్యక్షులు పల్లికొండ యాదగిరి, మండల కార్యదర్శి ఎర్రగారి సురేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆకు పవన్, తాలుక సంపత్, యూత్ కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి చిట్టిపల్లి ముకుంద, కమలాపురం గ్రామ అద్యక్షులు బెవర సత్యనారాయణ, పోదేం నాగేశ్వరావు, గొనె నగేష్, గిరి, బైపోతు రాము, చిన్న శంకర్, రవి, పుల్లూరి తిరుపతి, కిరణ్, గొడిషాల యాకూబ్, ఎట్టి సారయ్య, మైప లాలయ్య, బసారికారి హరికృష్ణ , బొర్రయ్య, బూర్గుల సతీష్, మేడిపల్లి శశి కుమార్, మండల సోమయ్య, గగ్గూరి మహేష్, చిన్నపెల్లి రాంబాబు, అన్నాల వెంకన్న, దోమల నరేందర్, కుంట నర్సింహామూర్తిలు పాల్గొన్నారు.