
బజారత్నూర్ మండలంలోని పిప్రి గ్రామంలో నిర్వహించే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభకు ముధోల్ నియోజకవర్గం లో ఆయా మండలాల నుంచి మాజీ ఎమ్మెల్యే నారాయణ రావు పటేల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బుధవారం బయలుదేరి వెళ్ళారు. పిప్రి గ్రామంలో డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో కృతజ్ఞత సభ జరగనుంది. ఈ సభలో పాల్గొనేందుకు ముధోల్ మండల ఇంచార్జ్ రావుల గంగారెడ్డి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక వాహనాలలో బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమం లో మైనారిటీ జిల్లా అధ్యక్షులు ఎం ఏ లాతీప్,యూత్ అధ్యక్షులు రావుల శ్రీనివాస్,ఎస్సీ సెల్ టౌన్ అధ్యక్షులు శరత్, లోకేశ్వరం మండల్ ఇంచార్జ్ సుదర్శన్ రెడ్డి, జనరల్ సెక్రటరీ సుదీర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు, పాల్గొన్నారు.