నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మండలస్థాయి ఇంగ్లీషు మీడియం చెక్ ముఖి పోటీలు నిర్వహించినట్లుగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మల్కా భాస్కర్ రావు తెలిపారు. ఈ పోటీల్లో మీనం నవ్య, పోలోజు వైష్ణవి, కోడిమ్యాల లాస్య ప్రథమ స్థానం సాధించి ఫిబ్రవరి 3న జరిగే జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. అదేవిధంగా కస్తూరిబ్బా ఆశ్రమ పాఠశాలకు చెందిన ఎం హారిక, జె.శ్రీనిధి, ఎన్ సుస్మిత తెలుగు మీడియం విభాగంలో ప్రథమ స్థానం జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయినట్లుగా తెలిపారు.